Morning 7AM News : మార్నింగ్ 7am షార్ట్ 15 న్యూస్.. ఫటాఫట్..!

Morning 7AM News : ఇవాళ మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మంత్రి హరీష్‌ రావు పర్యవేక్షణలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు.

Update: 2022-02-23 01:30 GMT

1. ఇవాళ మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మంత్రి హరీష్‌ రావు పర్యవేక్షణలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు.

2. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను సైతం కేంద్రం అమలు చేయడం లేదన్నారు మండిపడ్డారు టీఆర్‌ఎస్‌ నేతలు. తెలంగాణపై బీజేపీకి కక్ష ఉంది కాబట్టే అభివృద్ధికి సహకరించడం లేదన్నారు.

3.దేశ రాజకీయాల పేరుతో కొత్త డ్రామాను సీఎం కేసీఆర్‌ షురూ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు.

4. తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణంపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. కేంద్ర పర్యావరణ శాఖపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌పై రెండేళ్లయినా కౌంటర్ దాఖలు చేయనందుకు పది వేలు జరిమానా విధించింది.

5. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీటెక్‌ రవి పోటీ చేస్తారని నేతల సమావేశంలో వెల్లడించారు. వైసీపీ అక్రమాలపై పోరాడాలని సూచించారు.

6. బాబ్లీ ప్రాజెక్టు దగ్గర ధర్నా చేపట్టిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేసింది. చంద్రబాబు సహా 23 మందిపై ఉన్న కేసును కొట్టివేస్తున్నట్లు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.

7. వివేకా హత్య కేసులో దస్తగిరి చెప్పిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అప్రూవర్‌గా మారాక ఎంపీ అవినాష్‌ రెడ్డి తనను కలిసేందుకు వచ్చినట్లు సీబీఐకి తెలిపాడు. హత్యకు సంబంధించిన విషయాలు సీబీఐకి చెప్పకుండా ఉండేందుకు తనకు డబ్బుులు, భూములు ఎరగా చూపినట్లు వివరించాడు.

8. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఇవాళ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు.

9. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం బండారులంక పంచాయతీ కార్యాలయంలో రగడ జరిగింది. 14వ ఆర్ధిక సంఘంలో చేసిన పనులకు 15వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించాలని తీర్మానించారు. తలుపులు వేసి మరీ తీర్మానం చేసుకున్నారు.

10. మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నేత ఇంటి ముందు ఓ మహిళ నిరసన దీక్షకు దిగింది. తన స్థలంలో బోరుబావి తవ్వుతుండగా టీఆర్‌ఎస్‌ నాయకుడు అడ్డుకున్నాడని నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది. 

11. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. దుమ్ముగూడెం మండలం చింతగుఫ్ఫ గ్రామ శివారులో వంతెన పనుల చేస్తున్న కూలీలను పంపించేసి, వాహనాలకు నిప్పంటించారు. ఆరు ట్రాక్టర్లు దగ్ధమయ్యాయి.

12. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిత్యం ప్రత్యేక పూజల చేస్తున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఈవో పెద్దిరాజు... స్వామిఅమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించారు.

13. యూపీ ఎన్నికల ప్రచారంలో సమాజ్‌ వాదీ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదులకు సాయం చేసిన పార్టీ అంటూ ఆరోపణలు చేశారు. యూపీలో అనేక పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులపై ఎస్పీ ప్రేమ వలకబోసిందన్నారు.

14. ఇరు దేశాల మధ్య వివాదంపై ప్రధాని మోదీతో టీవీ డిబేట్‌కు సిద్ధంగా ఉన్నామన్నారు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. భారత్‌తో సంబంధాల మెరుగుపడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

15. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఘర్షణల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు భారతీయులను తిరిగి దేశానికి తీసుకురావాలని ప్రత్యేక విమానాలు పంపింది. ఇప్పటికే అనేక మంది ఢిల్లీకి చేరుకున్నారు.

Tags:    

Similar News