Morning 7AM News : మార్నింగ్ 7am షార్ట్ 15 న్యూస్.. ఫటాఫట్..!

Morning 7AM News : రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలకు కీలక ముందుడుగు పడింది. ఇరుదేశాల ప్రతినిధుల బృందం చర్చలు జరిపేందుకు ఇవాళ ఉక్రెయిన్ -బెలారస్ సరిహద్దు ప్రాంతంలో సమావేశం కానున్నారు.

Update: 2022-02-28 01:30 GMT

1. రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలకు కీలక ముందుడుగు పడింది. ఇరుదేశాల ప్రతినిధుల బృందం చర్చలు జరిపేందుకు ఇవాళ ఉక్రెయిన్ -బెలారస్ సరిహద్దు ప్రాంతంలో సమావేశం కానున్నారు.

2. ఉక్రెయిన్ సంక్షోభంపై కేంద్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారతీయుల తరలింపు, రష్యా, ఉక్రెయిన్ దేశాలల్లో ఏర్పడిన పరిస్థితులపై మోదీ హైలెవల్‌ భేటీలో చర్చించారు.

3. ఏపీలోని 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్నవారికి కొత్తగా ఈ బాధ్యతలు అప్పగించారు.

4. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు... జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారంటూ మండిపడ్డారు.

5. రైతులపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. యాసంగిలో తెలంగాణలో పండే బాయిల్డ్‌ రైస్‌ కొనబోమంటూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.

6. మంత్రి కొడాలి నానిపై చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శి రామానాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్మూనిస్టు నాయకుల గురించి తప్పుడు కూతలు కూస్తే నాలుక కోస్తామన్నారు.

7. తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా సేద్యం రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతుంది. రొయ్యల మేత ధర భారీగా పెరడగంతో అక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

8. తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మహబూబాబాద్‌లో పర్యటించారు. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో కలిసి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

9. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి తరఫున శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

10. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులను ఊరేగించారు.

11. విశాఖ సాగర తీరంలో మిలాన్‌-2022 అద్భుత విన్యాసాలు అందర్నీ కట్టిపడేశాయి. సుమారు 39 దేశాల నుంచి నౌకలు, సబ్‌మెరైన్‌లు, యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.

12. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో 37వ రాజీవ్‌ గాంధీ ఆల్‌ ఇండియా అండర్‌ 19-టీ20 డే అండ్‌ నైట్‌ క్రికెట్‌ ఛాంపియన్‌ షిప్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ముఖ్యఅతిధిగా మాజీ కేంద్ర మంత్రి అన్వర్‌, పలువురు నేతలు పాల్గొని, పోటీలు నిర్వహించారు.

13. మార్కాపురం జిల్లా సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఒంటెద్దు బండ్ల యూనియన్‌, చక్క రిక్షాల కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.

14. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ జరిగింది. ఫిల్మ్‌ నగర్‌లోని ఆయన ఆఫీసులో 5 లక్షల విలువ చేసే సామాగ్రిని దొంగలించడంతో... మంచు విష్ణు మేనేజర్‌ సంజయ్‌.. పోలీసులకు కంప్లైంట్‌ చేశారు.

15. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికురాలి నుంచి సుమారు 18 లక్షలు విలువ చేసే 350 గ్రాముల బంగారాన్ని సీజ్‌ చేశారు. 

Tags:    

Similar News