Short 15 News : మార్నింగ్ 7am షార్ట్ 15 న్యూస్.. ఫటాఫట్..!
కాంగ్రెస్ పార్టీకి రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టంచేశారు. 15 రోజులు వేచి చూసి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
1. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశ రాజకీయాలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చించారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందన్నారు.
2.దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయ నడుస్తోందని ఆరోపించారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదన్నారు. సోదర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ కలిసి నడుస్తాయని ప్రకటించారు.
3. సంక్షేమ పథకాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు సీఎం కేసీఆర్... తన వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు.
4. జీవో నంబరు 217తో లక్షల మంది మత్స్యకారుల పొట్టకొడుతున్నారంటూ జగన్ సర్కార్‌పై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తమ పార్టీ అధికారంలోకి వస్తే జీవో 217ను రద్దు చేస్తామన్నారు. మత్స్యకారుల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమన్నారు.
5.జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం తప్పింది. వాహనంపై నిలబడి అభివాదం చేస్తున్న పవన్‌ను ఓ అభిమాని ముట్టుకునేందుకు ప్రయత్నించాడు.. ఈ క్రమంలో పవన్ బ్యాలెన్స్ తప్పి కిందకు పడ్డారు.
6.కాంగ్రెస్ పార్టీకి రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టంచేశారు. 15 రోజులు వేచి చూసి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమస్య మూలాలను తెలుసుకోవడం లేదన్నారు.
7.గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ ఆయన బెదిరించారని ఆరోపణలున్నాయి.
8.సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల జాప్యాన్ని లేఖలో ప్రస్తావించిన కిషన్‌రెడ్డి.. 13 వందల కిలోమీటర్ల రైల్వే లైన్ల పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.
9.ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వ్యాప్త పాదయాత్రకు ముదిరాజ్ యువసేన అధ్యక్షులు బోల్ల గణేష్ పిలుపునిచ్చారు. ముదిరాజ్‌లంతా ఐక్యంగా పోరాడి... హక్కులు కాపాడుకోవాలన్నారు.
10. విశాఖలో భూగర్భ మురుగు నీటి రీసైకిలింగ్ ప్రాజెక్టు పూర్తి అవినీతిమంగా మారిందని.. సిపీఎం ఫ్లోర్ లీడర్ గంగారావు ఆరోపించారు. 500 కోట్ల ప్రాజెక్టును రివైజ్ చేసి.. 942 కోట్లకు పెంచడం వెనుక మతలబు దాడి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
11.తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో.. మాతృభాషా దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమం చేపట్టారు. మాతృబాషని కాపాడుకోవాలని కోరుతూ సబ్బులతో శిల్పం రూపొందించారు.
12.శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి శివదీక్షా విరమణ కార్యక్రమం కొనసాగుతోంది. భక్తుల సౌకర్యార్థం వచ్చేనెల 6 వరకు దీక్షా విరమణ నిర్వహించనున్నారు. ఇక మహాశివరాత్రి నేపథ్యంలో స్వామివారికి విశిష్ట పూజలు జరుగుతున్నాయి.
13.పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజు పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 63.44 శాతం పోలింగ్ నమోదైంది.
14.యూరప్ దేశాలను యునిస్ తుపాను వణికించింది. దక్షిణ ఇంగ్లండ్, బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్స్, సౌత్‌వేల్స్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. గంటకు 196 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులతో విరుచుకుపడ్డాయి. 9 మంది మరణించారు.
15. సొంతగడ్డపై టీమిండియా చెలరేగింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మూడో టీ ట్వంటీలో వెస్టిండీస్‌పై 18 పరుగుల తేడాతో నెగ్గి 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా... వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ఓడిపోయింది.