Unemployed Students : నిరుద్యోగ భృతి రూ.5 వేలు ఇవ్వాలి.. మోత్కుపల్లి డిమాండ్

Update: 2024-07-11 09:52 GMT

రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.5 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహాలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గురువారం ఆయన యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల ఆందోళనలను పోలీసులతో అణచివేయించడం సరైన పద్దతి కాదన్నారు.డిమాండ్ల సాధన కోసం యూనివర్సిటీల్లో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపి పోలీసులు వారిని కొడుతున్నారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బీసీలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నారని.. ఇది బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

Similar News