టీఆర్ఎస్ నేతల్ని దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చిన బండి సంజయ్
నాగార్జున సాగర్‌లో దండుపాళ్యం బ్యాచ్ తిరుగుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.;
నాగార్జున సాగర్‌లో దండుపాళ్యం బ్యాచ్ తిరుగుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంజయ్.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జానారెడ్డిని కేసీఆర్ గెలిపిస్తాని చెప్పినందుకే పోటీ చేస్తున్నారంటూ ఆరోపించారు. అలాంటి వ్యక్తి గెలిస్తే నియోజకవర్గంలో ఏం అభివృద్ధికి చేస్తాడని ప్రశ్నించారు. తమ అభ్యర్థి రవినాయక్‌ను కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.