TG : కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు: ఎంపీ రఘునందన్

Update: 2024-11-02 09:30 GMT

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నా తెలంగాణకు చేసిందేమి లేదని, రాజకీయాల నుంచి వైదొలిగినా తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. మీరు అధికారం కోసమే రాజకీయాలకు వచ్చారని, అధికారం పోగానే రాజకీయాల నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచన కలుగుతుందని అన్నారు. గతంలో మీరు ఫామ్ హౌస్ నాటకాన్ని తీసుకొచ్చారని, అదే ఫామ్ హౌస్ నాటకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దీపావళి పండుగ ముందు రోజున ఎవరైనా మందు పార్టీలు చేసారా? తెలంగాణలో ఎవరైనా మహిళలు మద్యం తాగుతారా? అని అంటూ.. ఇది రేవు పార్టీ లేదా రావుల పార్టీ అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News