Uttam Kumar Reddy : హుజూర్ నగర్ నియోజకవర్గంలో అవినీతి తాండవిస్తోంది..!
Uttam Kumar Reddy : హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలంలోని చెక్ డ్యాం నిర్మాణం పనులను టీపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు;
Uttam Kumar Reddy : హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలంలోని చెక్ డ్యాం నిర్మాణం పనులను టీపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. చెక్ డ్యాం నిర్మాణం రైతుల కోసమా లేకా కాంట్రాక్టర్ల కోసమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హుజూర్ నగర్ లో గత రెండేళ్లుగా అవినీతి తాండవం చేస్తుందని, నీచ రాజకీయాలకు నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి, కాంట్రాక్టు పనులను ఎలా ఇస్తారని అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాలే తప్ప .. కాంట్రాక్టర్ల కోసం కాదని అన్నారు.