TG : ట్రాన్స్ జెండర్స్ తో ముజ్రాపార్టీ.. బాలాపూర్ లో కలకలం

Update: 2024-11-04 08:30 GMT

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముజ్రాపార్టీ కలకలం రేపింది... బాలాపూర్‌ పీఎస్‌ పరిధిలోని అలీనగర్‌లో ఈ ముజ్రా పార్టీ నిర్వహించారు. స్థానికంగా ఉండే కొందరు ట్రాన్స్‌ జెండర్స్‌తో ముజ్రాపార్టీ అంటూ తప్పతాగి భారీ శబ్దాలతో తమకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు గొడవకు దిగారు… పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అడిగితే గొడవకు దిగుతున్నారని, ముజ్రా పార్టీ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Tags:    

Similar News