Khammam: ఖమ్మంలో విషాదం.. పైపులో ఇరుక్కుని మున్సిపల్ కార్మికుడు మృతి..
Khammam: ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదవశాత్తు పైపులో ఇరుక్కుని మృతి చెందాడు.;
Khammam: ఖమ్మం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదవశాత్తు పైపులో ఇరుక్కుని మృతి చెందాడు. 23 ఏళ్ల చిర్ర సందీప్... నయాబజార్ ప్రభుత్వ కళాశాల దగ్గరున్న వాటర్ ట్యాంకును శుభ్రపరిచే క్రమంలో ప్రమాదవశాత్తు జారి పైపులో ఇరుక్కుపోయాడు. రంగంలోకి దిగిన రిస్క్యూ టీమ్ అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయింది. గంటన్నరపాటు శ్రమించి పైపు నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. పెద్ద ఎత్తున సంఘటనా స్థలికి చేరుకున్న మున్సిపల్ కార్మికులు, స్థానికులు.. సందీప్ మృతితో ఆందోళనకు దిగారు. బాధితుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.