Munugode By-Poll: మునుగోడు బైపోల్.. గులాబీ పార్టీలో జోష్
Munugode By-Poll: మునుగోడు బైపోల్ నేపథ్యంలో... నేతల చేరికలతో గులాబీ పార్టీలో జోష్ పెరిగింది. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.;
Munugode Bypoll: మునుగోడు బైపోల్ నేపథ్యంలో... నేతల చేరికలతో గులాబీ పార్టీలో జోష్ పెరిగింది. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. టీఆర్‌ఎస్ నుంచి వెళ్లిన నేతలకు ఫోన్లు చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇవాళ బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కాసేపట్లో కారు ఎక్కబోతున్నారు.
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో గులాబీ కండువా వేసుకోనున్నారు. ఇప్పటికే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక.... ఏనుగు రవీందర్‌రెడ్డి, స్వామిగౌడ్‌లతో నూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు... తమ పార్టీ నేతలు బీజేపీలోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీతో ఎవరెవరు టచ్‌లో ఉన్నారో వారందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.
మరోవైపు.... బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్... రాజీనామా లేఖను బండి సంజయ్‌కు పంపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు శ్రవణ్. తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం అనిశ్చితమైన దశ దిశా లేని రాజకీయా పరిణామాలు కొనసాగుతున్నాయన్నారు.
ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామన్న బండి సంజయ్.. . మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందన్నారు. సామాజిక బాధ్యత లేకుండా.. ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలు ఏలేలా.... పెట్టుబడి రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు...
బీజేపీలో కొనసాగిస్తున్న వైఖరి తన లాంటి బలహీన వర్గాలకు చెందిన నేతలకు స్థానం ఉండదని తేటతెల్లమైందన్నారు దాసోజు శ్రవణ్. . అనేక ఆశలు, ఆశయాలతో.. బీజేపీలో చేరినప్పటినుంచి దశ దిశా లేని నాయకత్వ ధోరణలు, నిర్మాణాత్మక రాజకీయాలకు, కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలోనే అర్థమైందన్నారు.
ప్రజాహితమైన పథకాలతో నిబద్ధత కలిగిన రాజకీయ సిద్దంతాలతో ప్రజలను మెప్పించడం కంటే.. మందు, మాంసం, విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం తద్వారా మునుగోడు ఎన్నికలలో బీజేపీ గెలుపు సాధించాలనుకుంటోందన్నారు. ఈ తీరు పట్ల నిరసన తెలియ జేస్తూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు దాసోజు శ్రవణ్.