టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ఖైరతాబాద్ ఆర్‌టీఓ కార్యాలయానికి వెళ్లారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడానికి ఆయన ఆర్‌టీఓ ఆఫీస్‌కు వచ్చారు. అక్కడ ఆయన ఆర్‌టీఏ జాయింట్ కమిషనర్ రమేశ్‌ను కలిశారు. అనంతరం రవాణా శాఖ అధికారులు చైతూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేశారు. ఆర్‌టీఓ కార్యాలయానికి నాగచైతన్య వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు.
నాగచైతన్య 'తండేల్' మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. నాగచైతన్య సరసన హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తోంది. దేవిశ్రీ సంగీతం అంతటా దుమ్ములేపుతోంది.