Narendra Modi: తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది: మోదీ
Narendra Modi: తెలంగాణలో బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు ప్రధాని మోదీ.;
Narendra Modi: తెలంగాణలో బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు ప్రధాని మోదీ. సికింద్రాబాద్ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు చూసే.. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లోని నిర్వహించామన్నారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో.. అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దశాబ్దాలుగా వెనకబడి ఉన్న వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేశామని.. పేదలు, ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ప్రధాని మోదీ.