Narendra Modi: అనూహ్యంగా సాగిన మోదీ ప్రసంగం.. దీని వెనుక ఉద్దేశం ఏంటి..?
Narendra Modi: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగం అనూహ్యంగా సాగింది.;
Narendra Modi: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగం అనూహ్యంగా సాగింది. ఎక్కడా రాజకీయ అంశాలు లేవనెత్తకుండా.. అభివృద్ధి అంశాలనే ప్రస్తావించారు. కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. ఇవాళ మోదీ ప్రసంగంపై అంతా ఉత్కంఠగా ఎదురుచూసినా.. ఎక్కడాకూడా విమర్శలు చేయలేదు. దీంతో ప్రధాని ప్రసంగం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేది రాజకీయవర్గాలు రకరకాలుగా విశ్లేషించుకుంటున్నాయి. పక్కా వ్యూహంతోనే మోదీ ప్రసంగం సాగిందని అంచనా వేస్తున్నాయి.