Tummala Nageswara Rao : నేతన్నలకు జాతీయ అవార్డులు.. రాష్ట్రానికే గర్వకారణం
నల్గొండ జిల్లా పుట్టపాక నేతన్నలకు జాతీయ పురస్కాలు దక్కాయి. సహజ రంగులతో తేయిలా రుమాల్ రూపొందించిన గూడ పవన్ యంగ్ వీవర్ విభాగంలో, నర్మదకు చేనేత వస్త్రాల మార్కెటింగ్ విభాగంలో జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన చేనేత కార్మికులకు తుమ్మల అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా, అందులో మన తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం గర్వకారణమన్నారు.
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. నేతన్నల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటీవల చేనేత కార్మికుల కోసం రుణమాఫీ ప్రకటించి రూ. 33 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం కోసం ప్రత్యేక లేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేసినట్లు వెల్లడించారు.