Metro Express Service: దిల్‌సుఖ్‌నగర్-కోకాపేట్ మధ్య కొత్త మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు..
Metro Express Service: నగర శివార్లలో నివసించే వారికి మెరుగైన కనెక్టివిటీని అందించడానికి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TSRTC ) దిల్‌సుఖ్‌నగర్, కోకాపేట్ మధ్య కొత్త మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రవేశపెట్టింది.;
TSRTC: నగర శివార్లలో నివసించే వారికి మెరుగైన కనెక్టివిటీని అందించడానికి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TSRTC ) దిల్‌సుఖ్‌నగర్, కోకాపేట్ మధ్య కొత్త మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రవేశపెట్టింది.
డిమాండ్, పౌరుల నుండి వచ్చిన అభ్యర్థనల దృష్ట్యా, కార్పొరేషన్ దిల్‌సుఖ్‌నగర్ - కోకాపేట్ స్ట్రెచ్‌లో నాలుగు కొత్త మెట్రో ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టింది. ఈ బస్సులు ప్రతి 40 నిమిషాలకు ఒకసారి నడపబడతాయని, కోటి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, లంగర్ హౌజ్, టిపుఖాన్ బ్రిడ్జి, బండ్లగూడ, తారామతిపేట, నార్సింగి మీదుగా ఈ బస్సులు వెళ్తాయని TSRTC అధికారులు తెలిపారు.
కొత్తగా ప్రవేశపెట్టిన బస్సులు దిల్ సుఖ్ నగర్ నుంచి ఉదయం 6 గంటలకు, డిపో నుంచి చివరి బస్సు రాత్రి 8.40 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా కోకాపేట్ బస్టాప్ నుంచి మొదటి బస్సు ఉదయం 7.25 గంటలకు, చివరి బస్సు రాత్రి 10 గంటలకు ఉంటుంది.
" కోకాపేట్ , గండిపేట్, నార్సింగి పరిసర ప్రాంతాల నివాసితులు ఈ సేవలను పొందగలరు. పౌరులు సులభంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు" అని TSRTC అధికారి తెలిపారు.