Deputy CM Bhatti Vikramarka : త్వరలోనే కొత్త పవర్ పాలసీ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Update: 2024-12-07 08:29 GMT

రాష్ట్రంలో త్వరలోనే కొత్త పవర్పాలసీ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని తెలిపారు. అడ్డ గోలుగా మాట్లాడటమే బీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయా ల్సిన పరిస్థితి ఉందని.. ఎన్ని ఇబ్బందులు న్నా.. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడి పిస్తున్నామని చెప్పారు. సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 'గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసింది. మేం 54వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. బీఆర్ఎ స్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేసింది. మా ప్రభుత్వం వచ్చాక రూ.52 వేల కోట్ల అప్పు చేశాం. చేసిన అప్పులను తిరిగి బ్యాంకులకే I & PR కట్టే పరిస్థితికి తెచ్చారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి వచ్చింది. సంక్షేమ పథకాలకు రూ.61వేల కోట్లు వెచ్చించాం. రైతు భరోసా, రుణమాఫీ, చేయూత, ఆరోగ్యశ్రీ పథకాలకు నిధులు కేటాయించాం. విద్యుత్పై భవిష్యత్ అవస రాలకు అనుగుణంగా ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నాం. మేము అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవస్థపై వైట్ పేపర్ ప్రకటించాం' అని తెలపారు.

Tags:    

Similar News