Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు జడ్జిలు..!
Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది..;
Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.. సెప్టెంబరు 16 నాటి కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో న్యాయ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.. తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ సి.సుమలత, జస్టిస్ జి.రాధారాణి, జస్టిస్ మాధవి దేవి, జస్టిస్ తుకారామ్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డిని నియమిస్తూ నోటిఫికేషన్ వెలువడింది.