New Year 2022: డీజే డ్యాన్సులతో యువత కేరింతలు.. కోవిడ్ ఆంక్షలతో..

New Year 2022: తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్‌ వేడుకలు.. అంబరాన్నంటాయి.

Update: 2022-01-01 09:49 GMT

New Year 2022 (tv5news.in)

New Year 2022: తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్‌ వేడుకలు.. అంబరాన్నంటాయి. యువత కేరింతలు, డీజే సౌండ్స్‌, డ్యాన్సులతో 2021కి గుడ్‌బై చెప్పి.. 2022కు గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు. సరిగ్గా 12 గంటలకు బాణాసంచాల కాల్పులు, విద్యుత్‌ దీపాల వెలుగుల మధ్య హ్యాపీ న్యూఇయర్‌ అంటూ సంబరాలు చేసుకున్నారు.

కొవిడ్‌ కారణంగా కొన్ని నగరాల్లో ఆంక్షలు ఉన్నా.. నిబంధనల మధ్యే వేడుకలు గ్రాండ్‌గా సాగాయి. రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అనుభవాలను భవిష్యత్‌కు పునాదిగా మలుచుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలు మరిన్ని విజయాలు సాధించి ప్రపంచంలోనే అత్యుత్తమ శిఖరాలకు ఎదగాలన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు 2021 కరోనా, వరద కష్టాలు మిగిల్చి వెళ్లిందన్నారు. ఆశయాల సాధనకు అవకాశాలు మోసుకోస్తున్న 2022కు స్వాగతం చెప్తామన్నారు.

Tags:    

Similar News