పబ్బులు, హోటల్స్‌పై నిఘా పెట్టాం.. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు: సజ్జనార్
సైబరాబాద్ పరిధిలో న్యూఇయర్ వేడుకలకు, ఈవెంట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు సీపీ సజ్జనార్. పబ్స్‌కి అనుమతి ఇచ్చిన సమయం వరకే ఓపెన్ చేయాలని చెప్పారు.;
సైబరాబాద్ పరిధిలో న్యూఇయర్ వేడుకలకు, ఈవెంట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు సీపీ సజ్జనార్. పబ్స్‌కి అనుమతి ఇచ్చిన సమయం వరకే ఓపెన్ చేయాలని, పబ్బులు, హోటల్స్‌పై నిఘా పెట్టామని చెప్పారు. ఫంక్షన్ హాల్, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్స్‌లో కూడా వేడుకలకు అనుమతి లేదన్నారు. ఇందుకు తమకు ప్రజలు సహకరించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. రిసార్ట్స్, పబ్బులు, స్టార్ హోటల్స్‌పై ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.