New Year Celebrations : మొదలైన న్యూ ఇయర్ వేడుకలు.. హైదరాబాద్‌లో హై అలర్ట్

Update: 2024-12-30 05:45 GMT

హైదరాబాద్ మహా నగరంలో న్యూ ఇయర్ వేడుకల సందడి మొదలైంది. అప్పుడే పోలీసులు కూడా అలర్టయ్యారు. అర్ధరాత్రి వరకు రోడ్లపై తమదైన శైలిలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కీలక సూచనలు చేశారు. పబ్స్, హోటల్స్ లో ముందస్తుగా తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్,ఎక్సైజ్, ఎస్ఓటీ, పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా సోదాలు చేపట్టారు. డ్రగ్స్ వాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. టైమింగ్స్ విషయంలో గీత దాటొద్దని సూచనలు చేస్తున్నారు. అంతేకాదు... తాగి రోడ్లపై హంగామా చేస్తే తాట తీస్తాం అని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. 

Tags:    

Similar News