Terror Links : నిజామాబాద్ టెర్రర్ లింకులపై ఎన్ఐఏ నజర్

Update: 2024-08-05 08:30 GMT

రాష్ట్రంలోని నిజామాబాద్లో ఉగ్రలింకులపై ఎన్ఐఏ అధికారులు విచారణ చేపడుతోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సానుభూతి పరులతో పాటు కీలక వ్యక్తులను ఎన్ఎస్ఐఎ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఉగ్రవాద భావాజలం పట్ల ఆసక్తి చూపు తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.

అలాగే ఉగ్ర సంస్థల సంబంధిత వ్యక్తులతో సంభాషణలు సాగిస్తున్నారన్న పక్కా ఆధారాలతో ఎస్ఐఎ అధికారులు పీ ఎఫ్ఎస్ఐ నేతలను గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఉగ్రకదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా షాయిన్ నగర్, పహడి షరీఫ్, అభిన్పురాల్లో అనుమానితులపై నిఘా సారిస్తున్నారు.

దుబాయ్, జిద్దాలతో పాటు కొన్ని అరబ్ దేశాలలో పనిచేస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారు ఐసిస్ ను బలోపేతం చేయాలన్న సంకల్పంతో కుట్ర పన్నుతున్నారని ఎన్ఐఏ అనుమానిస్తోంది.

Tags:    

Similar News