Night 10PM News : షార్ట్ 15 న్యూస్.. ఫటాఫట్..!
Night 10PM News : ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించుకుంటున్న పుతిన్.. ఉక్రెయిన్‌కు అండగా దేశాలు ముందుకు రాకుండా హెచ్చరికలు చేస్తున్నారు.
1. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో.. ఉక్రెయిన్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అన్ని వైపుల నుంచి భీకర దాడులు జరగుతుండటంతో.. ఉక్రెయిన్ వాసులు వలస బాట పట్టారు. ప్రభుత్వం పిలుపు మేరకు పురుషులు ఆయుధాలు ధరించగా.. మహిళలు, పిల్లలు.. సమీపంలోని యూరప్ దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్ నుంచి దాదాపు 50 లక్షల మంది.. యూరప్ దేశాలకు వలస వెళ్లినట్లు లెక్కలు వేస్తున్నారు
2. ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించుకుంటున్న పుతిన్.. ఉక్రెయిన్‌కు అండగా దేశాలు ముందుకు రాకుండా హెచ్చరికలు చేస్తున్నారు. రష్యా ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అణ్వస్త్ర రాజ్యమేనని అన్న పుతిన్.. తమ మీద దాడి చేస్తే వినాశకర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏ దేశమైన సైనికంగా ప్రయత్నిస్తే.. అణు దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
3. రష్యా భీకర పోరుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులను మోదీకి వివరించారు. ప్రధాని మోదీతో మాట్లాడినట్లు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. భద్రతా మండలిలో తమకు భారత్ నుంచి రాజకీయ మద్దతు కావాలని మోదీని కోరారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్.
4. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులతో వరుసగా రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు . యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు అధైర్య పడొద్దని సూచించారు. పార్టీ ఐటీ సెల్ సహకారంతో అవసరమైన సహాయం అందిస్తామని భరోసా కల్పించారు.
5. ఉక్రెయిన్‌లో మొత్తం 24వేల భారతీయ విద్యార్థులు ఉండగా.. అక్కడి గగనతలం మూసివేయక ముందు దాదాపు 8 వేల మంది భారత్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్నవారందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. అటు విద్యార్థుల పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వక్తం చేశారు.
6. హైదరాబాద్ తార్నాకాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో సైన్స్ వారోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫెస్టివల్ ఆఫ్ స్కోప్ ఫర్ ఆల్ పేరుతో వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
7. వేములవాడ రాజన్న ఆలయ గుడి మెట్లపై బీజేపీ చేపట్టిన దీక్షలో విజయశాంతి పాల్గొన్నారు.రాజన్న దేవస్థానం అభివృద్ధికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేవాలయాలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేయడం కేసీఆర్ నైజంగా మారిందన్నారు.
8. శ్రీకాకుళం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కావడంతో చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఎచ్చెర్ల మండలం కుప్పిలి అంగన్‌వాడి కేంద్రంలో చోటుచేసుకుంది. భోజనం చేశాక 14 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
9. లివర్ వ్యాధితో బాధపడుతూ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజు అనే బాలుడికి… మల్కాజ్‌గిరి MLA మైనంపల్లి హన్మంతరావు ఆర్థిక సాయం అందించారు. అల్వాల్‌కు చెందిన సంజు కుటుంబసభ్యులను కలిసిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనేజైషన్ ఛైర్మన్ రోహిత్... బాలుడి యోగక్షేమాలు తెలుసుకుని వారికి ఆర్థిక సాయం అందించారు.
10. రాజంపేట జిల్లా సాధన కోసం కడప కలెక్టరేట్‌కు పాదయాత్ర చేపట్టారు జేఏసీ నేతలు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేటను జిల్లా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు నేతలు. ప్రభుత్వం ప్రకటన చేసే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు.
11. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లెలోని ఉన్నతపాఠశాలలో మధ్యాహ్నభోజనం తిన్న 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని 108 సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల అస్వస్థత సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వివరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శించారు.
12. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.రాజధాని సమస్య అమరావతి రైతులదేకాదని ఐదుకోట్ల ఆంధ్రుల సమస్య అని అభిప్రాయపడ్డారు. అమరావతిని నిర్వీర్యం చేయటంతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఆర్థికంగా దెబ్బతింటున్నారని విమర్శించారు.
13. కనీస వేతనం 21 వేలకు పెంచటంతోపాటు DAతో కలిపి వేతనం ఇవ్వాలంటూ వీఆర్‌ఏలు తాడేపల్లి పురవీధుల్లో ఆర్ధనగ్నప్రదర్శన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంతో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మార్చి మూడు, నాలుగు తేదీల్లో రాష్ట్రస్థాయి దీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
14. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్ సమీపంలో సర్కార్ స్థలాలు ఆక్రమించారంటూ బాలానగర్ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్లు కోల్పోయిన బాధితులు మార్కెట్ కూడలిలో నిరసనకు దిగారు. రాజకీయనాయకుల ప్రమేయం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
15. విశాఖ జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ, విజయరాంపురం చెరువులో రాత్రివేళ లారీలు, జేసీబీల సాయంతో తరలిస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పలు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అదృశ్యమైన జేసీబీ కోసం రెవెన్యూ, పోలీసులు గాలించారు.