Hyderabad : నిమ్స్ మరో గుండె మార్పిడి చికిత్స

Update: 2025-03-27 08:45 GMT

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మరో గుండె మార్పిడి చికిత్స విజయవంతమైంది. ప్రాణాంతక గుండె జబ్బుతో బాధపడు తున్న 19 ఏళ్ళ అనిల్ కుమార్ అనే యువకుడికి నిమ్స్ వైద్యులు పునర్జన్మను ప్రసాదిం చారు. గుండెజబ్బుతో బాధపడుతున్న యువకుడికి మార్చి 7న నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్ఓడీ, డాక్టర్ అమరేశ్ రావు శస్త్రచికిత్సను నిర్వహించారు. ఆరోగ్యశ్రీ కింద అనిల్ కుమార్ కు ఉచితంగా గుండె మార్పిడి చికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ అమరేశ్ రావు, డా. గోపాల్, డా.కళాధర్ తెలియజేశారు. పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేస్తున్నట్లు తెలిపారు. గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన ఆసుపత్రి కార్డియో విభాగం వైద్యులను ఈ సందర్భంగా డైరెక్టర్ నగరి బీరప్ప ప్రత్యేకంగా అభినందించారు.

Tags:    

Similar News