Nizamabad: మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ
కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణుల యత్నం; NSUI, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన; తెలంగాణ యూనివర్శిటీలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్;
నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. కేటీఆర్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. NSUI, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ యూనివర్శిటీలో ఖాళీలను భర్తీ చేయాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్స్ ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.