రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ స్పందించారు. విద్యుత్ చార్జీలను పెంచడం లేదని, సామాన్యులపై భారం వేయడం లేదని ముషారఫ్ ఫారుఖీ స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ లోని విద్యుత్ నియంత్రణ భవన్ లో మాట్లాడుతూ..హెచ్ టీ11కేవీ వినియోగదారులపై కూడా చార్జీల భారం పడదని వెల్లడించారు. అలాగే ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఫిక్స్డ్ చార్జీలు ఉండబోవని, వారిని ప్రోత్స హించేందుకు ఈ నిర్ణయం తీసుకు న్నామని పేర్కొన్నారు. కేవలం 300 యూనిట్లు పైబడిన వారికి మాత్రమే ఫిక్స్ చార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు. శాఖ పరిధిలో ఫ్యూస్, ఇతర సామాగ్రి మిస్సింగ్ అవుతున్నాయని, అలా జరగకుండా ఉండేందుకు దానికోసం ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తున్నామన్నారు. కాగా, రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోతున్నట్లు ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంతేకాదు, కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈఆర్సీ చైర్మన్ రంగారావుకు వినతిపత్రం అందజేశారు.