TG : ఏడు గంటల తర్వత నో ట్రీట్​ మెంట్​?

Update: 2024-11-05 12:15 GMT

పేదవాడికి ఏ రోగం, నొప్పి వచ్చినా.. వెంటనే వెళ్లేది ప్రభుత్వ ఆస్పత్రులకే. అయితే ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది మాత్రం.. బాధతో వచ్చే రోగులను పట్టించుకోకుండా, వైద్యం చేయకుండా సాకులు చూపి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు సోమవారం సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఓ ఘటన బలం చేకూరుస్తున్నది. సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో తీవ్ర జ్వరంతో ఓ పేషెంట్​ గవర్నమెంట్​ హాస్పిటల్​ కు వెళ్లాడు. తనకు వైద్యం చేయాలని సిబ్బందిని కోరగా.. ఇప్పుడు ట్రీట్​ మెంట్​ చేయడం కుదరదు.. ఓపీలో రావాలి అని వెనక్కి పంపారు. జ్వరం ట్యాబ్లెట్స్​ కూడా ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. చివరికి చేసేదేం లేక.. దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్​ కు వెళ్లాడు.

Tags:    

Similar News