నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్..!
నాగార్జున సాగర్ అభ్యర్థి ఎవరనే విషయంపై టీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.;
నాగార్జున సాగర్ అభ్యర్థి ఎవరనే విషయంపై అధికార టీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. నోముల భగత్ కు సీఎం కేసీఆర్ బీఫాం అందించగా రేపు ఉదయం ఆయననామినేషన్ దాఖలు చేయనున్నారు. సాగర్ అభ్యర్థి కోసం ఇన్ని రోజులు కసరత్తు చేసిన కేసీఆర్.. చివరికి నోముల నర్సింహయ్య కొడుక్కే టికెట్ కేటాయించారు. అటు ప్రచార సభ కోసం భగత్ కి కేసీఆర్ రూ. 28 లక్షల చెక్కును అందించారు.
nommula bagath profile
పేరు: నోముల భగత్ కుమార్
తండ్రి: దివంతగ నోముల నర్సింహయ్య
తల్లి: నోముల లక్ష్మి
భార్య: నోముల భవానీ
పిల్లలు: కుమారుడు, కుమార్తె
పుట్టిన తేది: అక్టోబర్ 10, 1984
చదువు: BE, MBA, LLB, LLM
ఉద్యోగ అర్హతలు:
సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్ లో జూనియర్ ఇంజనీర్,
విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్ లో మేనేజర్ గా బాధ్యతలు,
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా విధులు
రాజకీయ అనుభవం:
2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఆర్గనైజర్
సివిల్ ప్రొఫైల్: నోముల ఎన్.ఎల్ ఫౌండేషన్ చైర్మన్