కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు సంబంధించి గత ఏడాది కాలంగా కొనసాగుతున్న జస్టిస్ పి. చంద్రగోష్ కమిషన విచారణ తుది దశకు చేరుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల నిర్మాణాలు, లోపాలు, వైఫల్యాలపై గత సంవత్సర నుండి విచారణ సాగుతోంది. గత ప్రభుత్వం లో చేపట్టిన కాళేశ్వరం నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఉపక్రమించింది...ఈ నేపథ్యంలో ఇంజినీర్లు, అధికారులనే కాకుండా అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష రావు ని సైతం పలుమారు విచారించిన కమిటీ తాజాగా మరోసారి విచారణ కు రావాలని నోటీసులు జారీ చేసింది.
బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను విచారించింది కమిటీ. వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అయితే, జూన్ 9న కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన హరీశ్ రావు తిరిగి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం విచారణ నిమిత్తం ఆయన బీఆర్కే భవన్‌కు వెళ్లనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి విచారణ కు హాజరవనున్నట్లు గా తెలుస్తోంది.
కాగా, తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.అనిల్ కుమార్ కు సైతం సోమవారం కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కు గ్రౌటింగ్ చేసిన విషయాన్ని ఎంక్వైరీలో దాచిపెట్టినట్లుగా కమిషన్ గుర్తించింది. ఉన్నత హోదాలో ఉండి అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆయనపై చైర్మన్ పీ చంద్రఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి మరోసారి విచారణ కు హాజర కావాలని కమిషన్ ఆదేశించింది.
కాగా, తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.అనిల్ కుమార్ కు సైతం సోమవారం కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కు గ్రౌటింగ్ చేసిన విషయాన్ని ఎంక్వైరీలో దాచిపెట్టినట్లుగా కమిషన్ గుర్తించింది. ఉన్నత హోదాలో ఉండి అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆయనపై చైర్మన్ పీ చంద్రఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి మరోసారి విచారణ కు హాజర కావాలని కమిషన్ ఆదేశించింది. మాజీ ఈఎన్సీ అనీల్ కుమార్ నోటీసుల ఇచ్చిన మరునాడే హరీశ్ రావును మరోసారి విచారణకు పిలవడం తో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.