NRI Sushmita Awarded : ఎన్నారై సుష్మిత‌కు స‌రోజినీ నాయుడు అవార్డు!

Update: 2024-10-25 10:45 GMT

అమెరికాలోని టెక్సాస్‌లో స్థిర‌ప‌డిన హైద‌రాబాద్ వాసి సుష్మితకు ప్రతిష్టాత్మక డాక్టర్ స‌రోజినీ నాయుడు అంత‌ర్జాతీయ అవార్డు ల‌భించింది. వ‌ర్కింగ్ ఉమెన్‌-2024 క్యాట‌గిరీలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ చాంబ‌ర్ ఆఫ్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ అండ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఉమెన్స్ ఫిల్మ్ ఫోర‌మ్ స‌హ‌కారంతో ఏఏఎఫ్‌టీ యూనివ‌ర్సిటీ ఈ అవార్డు ప్రధానం చేశారు. తెలంగాణ‌తోపాటు ద‌క్షిణ భార‌త దేశం నుంచి ఈ అవార్డు సొంతం చేసుకున్న సుస్మిత బుధ‌వారం నొయిడాలో జ‌రిగిన ఓ కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు.

Tags:    

Similar News