బ్రేకింగ్.. హైదరాబాద్‌లో కూలిన అసెంబ్లీ పాత భవనం
ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మినార్ నుంచి కొన్ని ముక్కలు ఊడిపడడంతో ముందు ఏం జరిగిందో అర్థంకాక అంతా ఆందోళన చెందారు.;
హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీ భవనం తూర్పువైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. పురాతన భవనం కావడంతో మినార్ శిధిలావస్థకు చేరవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అసెంబ్లీ సిబ్బంది చెప్తున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మినార్ నుంచి కొన్ని ముక్కలు ఊడిపడడంతో ముందు ఏం జరిగిందో అర్థంకాక అంతా ఆందోళన చెందారు.
అదృష్టవశాత్తూ శిధిలాలు గార్డెన్‌లో పడడం, అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. విప్ రేగా కాంతారావు ఆఫీస్ ఉండే చోట ఉన్న మినార్ అంచు విరిగిపోవడంతో.. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్టు అసెంబ్లీ అధికారులు చెప్తున్నారు.