మరోసారి వాయిదా పడ్డ టీపీసీసీ చీఫ్ ఎంపిక?
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరన్నది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. నాగార్జున సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పుడే అధ్యక్షుడి పేరు ప్రకటించరాదని అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం.;
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరన్నది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. నాగార్జున సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పుడే అధ్యక్షుడి పేరు ప్రకటించరాదని అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. ఒకవేళ ఇప్పుడే పీసీసీ చీఫ్ ప్రకటన చేస్తే పార్టీలో విబేధాలు తలెత్తుతాయని ఆ ప్రభావం సాగర్ ఉపఎన్నికపై ఉంటుందంటూ నల్గొండ జిల్లాకే చెందిన ఓ సీనియర్ నేత అధిష్టానానికి ఫోన్ చేశారు. ఎవరి పేరు ప్రకటించకపోవడమే మేలంటూ అభిప్రాయపడ్డారు. ఆయన భావనతో ఏకీభవించిన అధిష్టానం పీసీసీ అధ్యక్షుడి ప్రకటన నిలిపివేసింది.