TG : మా ప్రభుత్వానికి ఆడబిడ్డ ఆశీస్సులు ఉన్నాయి.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

Update: 2025-07-17 07:15 GMT

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆడబిడ్డల ఆశీర్వాదం ఉందని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇలా ప్రతి ఒక్క పథకం మహిళల పేరు మీదనే ఇస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డల ఆశీర్వాదం ఇస్తే ఇల్లయినా, ప్రభుత్వమైనా కలకాలం చల్లగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అందుకే ప్రతి పథకంలో వారికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ముందుకు సాగుతున్నట్లు తుమ్మల తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.21 వేల కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. అంతేకాకుండా 9రోజుల్లోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మహిళల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టినట్లు వివరించారు. రేషన్ కార్డులు లేని మహిళలకు ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తోందని చెప్పారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని మంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News