Telangana DGP : పాకిస్తానీలు హైదరాబాద్ వీడిపోవాలి : తెలంగాణ డీజీపీ ఆదేశాలు
తెలంగాణలో ఉన్న పాకిస్థానీలకు రాష్ట్ర డీజీపీ జితేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థానీలు వెంటనే రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పాకిస్థానీల వీసాలు 27 తర్వాత పని చేయవు అని స్పష్టం చేశారు. మెడికల్ వీసా మీద ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంటుందన్నారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదన్నారు. పాకిస్థానీలు తమ దేశానికి అటారీ బార్డర్ నుంచి వెళ్లొచ్చన్నారు. ఈ నెల 30 వరకు అటారీ బార్డర్ తెరుచుకుని ఉంటుందన్నారు. ఒక వేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.