TG : పాశమైలారం పేలుడు ఘటన .. 42కు చేరిన మృతులు

Update: 2025-07-01 11:30 GMT

పాశమైలారం సిగాచీ పరిశ్రమలో నిన్న జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో పేలుడు జరిగిన సమయంలో 800 డిగ్రీల ఉష్ణో గ్రత ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ ఇలం గోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందకు దిగుతుండగా పేలుడు జరగటంతో ఆయన మృతదేహం యాభై మీటర్ల దూరంఎగిరి పడిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ సమయంలో కర్మాగారంలో 147 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. 34 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల్లో గాలిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 11 ఫైరింజన్లు మంటలను ఆర్పేయడంతోపాటు శిథిలాలను తొలగించడంలో పాలు పంచుకుంటున్నాయి. హైడ్రా కూడా శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమైంది. కమిషనర్ రంగనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News