Pawan Kalyan: ముందు చూపు కలిగిన నాయకుడు: కేసీఆర్‌కు పవన్ బర్త్‌డే విషెసెస్
Pawan Kalyan: మీరు సదా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.;
Pawan Kalyan: తేదేపా అధినేత చంద్రబాబు.. మీరు సదా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
గొప్ప వాక్చాతుర్యం, ముందు చూపు కలిగిన నాయకుడు కేసీఆర్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి ఎంతటి జఠిలమైన సమస్య ఎదురైనా తన మాటలతో ప్రజలకు స్వాతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి అని ట్వీట్‌లో పవన్ పేర్కొన్నారు.
మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి.. మీ లక్ష్యసాధన, ప్రజాసేవకు ఆ భగవంతుడు మీకు అపరిమిత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా అని నటుడు చిరంజీవి ట్వీట్ చేశారు.
భాజపా అధ్యక్షుడు బండి సంజయ్.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.