Pawan Kalyan: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్..
Pawan Kalyan: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు.;
Pawan Kalyan: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈమేరకు ఆయన లేఖ విడుదల చేశారు. రైల్వేస్టేషన్‌లో రైలును తగులబెట్టడం దురదృష్టకరమన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్‌మెంట్ విధానాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు ఆవేదన కలిగించాయని తెలిపారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని లేఖలో అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.