బీజేపీ అవమానించింది.. మా మద్దతు టీఆర్ఎస్ అభ్యర్ధికే : పవన్ కళ్యాణ్

హైదరాబాదులో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మాట్లాడిన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.;

Update: 2021-03-14 06:05 GMT

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ జనసేనను చులకన చేసేలా మాట్లాడిందని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తమతో ఉన్నా... తెలంగాణ రాష్ట్ర నాయకత్వం జనసేనను అవమానించిందని తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పీవీ వాణీదేవికి మద్దతిస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. 

Tags:    

Similar News