మానసిక ఒత్తిడుల నుంచి బయటపడేందుకు, శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో ముఖ్యమని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 2027లో హైదరాబాద్ లో ఆసియా కరాటే పోటీలు నిర్వహించనున్నా మని వెల్లడించారు. సోమవారం ఇక్కడ జరి గిన ఒక కార్యక్రమంలో మహేష్కుమార్ గౌడ్ కు ఒకినవా మార్షల్ అకాడమీ కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ - 7 ప్రదానం చేసింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన కరాటే పోటీలో నెగ్గిన పీసీసీ చీఫ్ బ్లాక్ బెల్ట్ డాన్ 7 అవార్డును అందుకున్నారు. గ్రాండ్ మాస్టర్ ఎస్ శ్రీనివాస్ బ్లాక్ బెల్టు ప్రదా నం చేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, కరాటే క్రీడ తన జీవితంలో భాగం. ఎంత బిజీగా ఉన్నా కరాటేకు సమయం కేటాయిస్తానని చెప్పారు.
సమాజంలో క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోయిందని, కార్పోరేట్ చదువుల కారణంగా ఆటలు, వ్యాయామానికి అవకా శమే లేకుండా పోయిందని, పిల్లలు కంప్యూటర్ కిడ్స్ మారిపోతున్నారని, మానసిక ఒత్తిడికి గురువుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు మహేశ్ గౌడ్. కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీ య ఉపాధ్యక్షుడిగా కరాటే పోటీల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికెట్ తీసుకోవడం గర్వంగా ఉంద న్నారు. కరాటే పోటీలలో ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ తదితర దేశాలలో పర్యటించానని, అక్కడ ప్రతి ఇంటిలో ఒక క్రీడాకారుడు ఉంటా రని తెలిపారు. క్రీడలలో రాణించేలా తల్లిదం డ్రులు ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలో కరాటేను ప్రోత్సహించేందుకు గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో జాతీయ పోటీలు నిర్వహించామని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు.