TG : పదవి కన్నా ప్రజలే ముఖ్యం.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి కీలక కామెంట్స్..
అధికార కాంగ్రెస్ పార్టీలో నేతలకు కాసింత ఫ్రీడం ఎక్కువనే చెప్పొచ్చు. మైక్ ముందుకు వస్తే చాలు...ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వచ్చే పదేళ్లు తానే సీఎం అంటూ ఇతర కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేశారు. ఐతే ఈ వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ ను తన వ్యక్తిగత సామ్రాజ్యం గా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి చూస్తున్నారని...అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు దీనిని సహకరించారని కాస్త ఘాటుగానే స్పందించారు.
మంత్రి పదవి ఆశిస్తున్న నేతల్లో టాప్ లిస్ట్ లో ఉంటారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో తన మంత్రి పదవి గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ...ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే తనకుమంత్రి పదవి ఇస్తామన్నారని... కానీ పదవి కన్నా మునుగోడు ప్రజలే తనకు ముఖ్యమని అన్నారు. అందుకే మునుగోడు నుంచే పోటీ చేసినట్లు తెలిపారు. 2018 ఎన్నికల్లో అందరూ ఓడిపోతే తాను గెలిచానని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం వల్లే తాను ఓడిపోయానని చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి.