కరోనాను లెక్కచేయని జనం.. మాస్కులు లేకుండానే రోడ్లమీదకు

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంటే.. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద జనసందోహం ఏమాత్రం కరోనా నిబంధనలు పాటించడంలేదు.

Update: 2021-04-20 11:00 GMT

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంటే.. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద జనసందోహం ఏమాత్రం కరోనా నిబంధనలు పాటించడంలేదు. షాపుల వద్ద గుంపులు, గుంపులుగా భౌతిక దూరం పాటించకుండా కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు రాత్రి కర్ఫ్యూ విధించడంతో షాపులవద్ద జనం రద్దీ ఎక్కువైంది. మరికొందరైతే కనీసం మాస్కులు కూడా లేకుండా రోడ్లమీదకు వస్తున్నారు.

అటు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి తొమ్మిద గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. ఈ రోజు నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకి మినహాయింపు ఇవ్వనున్నారు. నైట్ కర్ఫ్యూ తో బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు మూతపడనున్నాయి. మే 1 వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలు కానుంది.

Tags:    

Similar News