1000 కిలోమీటర్లకి చేరిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మరో మైలురాయికి చేరువైంది.;
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మరో మైలురాయికి చేరువైంది. ఇవాళ సాయంత్రానికి వెయ్యి కిలోమీటర్ల పూర్తి చేసుకోనుంది. నల్గొండ జిల్లా దేవరకొండ శివారు నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. కుమ్దల పహాడ్ క్రాస్ రోడ్, కొండమల్లేపల్లి, గుమ్మడవెల్లి మీదుగా సాగనుంది. పాదయాత్ర వెయ్యి కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. గుమ్మడివెళ్లిలో పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు భట్టి విక్రమార్క. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం జరగనున్న కార్నర్ మీటింగ్ భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి పాల్గొననున్నారు.