తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ వ్యవహారంలో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 269 మంది బాధితుల స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 4,200లకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో అన్ని పార్టీల నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో విచారణకు వచ్చిన స్టేట్ మెంట్ ఇవ్వాలని మల్లన్నకు సిట్ సూచించింది. దీంతో గురువారం మల్లన్న సిట్ ఎదుట హాజరై స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు. కాగా ఈ కేసులో సిట్ కొంత కాలం నుంచి దూకుడు పెంచింది. బాధితులందరి స్టేట్ మెంట్లను రికార్డ్ చేసి బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చేసేందుకు సిట్ అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావును విచారించి కీలక విషయాలను రాబట్టారు.