Piyush Goyal: 'కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం': పీయూష్ గోయల్
Piyush Goyal: యాసంగి ధాన్యం కొనుగోళ్ల అంశం మరింత ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం-కేంద్రం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.;
Piyush Goyal: యాసంగి ధాన్యం కొనుగోళ్ల అంశం మరింత ముదురుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం-కేంద్రం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. యాసంగి వరిని కేంద్రం కొనాల్సిందేనని.. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరికలు పంపారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలుపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎన్నిసార్లు కోరినా ఎంత ముడి ధాన్యం ఇస్తారో చెప్పడం లేదంటూ మండిపడ్డారు. పంజాబ్‌కు అనుసరిస్తున్న విధానాన్నే తెలంగాణకూ అనుసరిస్తున్నామని తెలిపారు.