KCR : సీఎం కేసీఆర్‌ను మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
కరోనా వ్యాప్తిని పెంచే అవకాశం ఉన్న సూపర్ స్పైడర్లను గుర్తించి వారికి మొదట టీకాలు వేస్తే మంచిదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కు సీఎం KCR సూచించారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని దేశ ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. కరోనా వ్యాప్తిని పెంచే అవకాశం ఉన్న సూపర్ స్పైడర్లను గుర్తించి వారికి మొదట టీకాలు వేస్తే మంచిదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కు సీఎం KCR సూచించారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ సరఫరాదారులు, స్ట్రీట్ వెండర్స్, కార్మికులు ఈ జాబితాలో ఉంటారన్నారు రాష్ట్రాలకే వెసులుబాటు కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ సూచనల మీద సానుకూలంగా స్పందించిన హర్షవర్ధన్ ప్రధానితో చర్చించారు. అనంతరం సీఎంకు మోదీ ఆదివారం రాత్రి ఫోన్ చేసి అభినందించారు. మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి.. వాటిని తప్పకుండా ఆచరణలో పెడతామని అన్నారు. అటు రాష్ట్రానికి మరింతగా ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సీఏం కేసీఆర్.. మోదీని కోరారు.