Kishan Reddy Arrest: పోలీసుల అదుపులో కిషన్ రెడ్డి
డబుల్ బెడ్రూం ఇళ్లపై బీఆర్‌ఎస్,బీజేపీ మధ్య ఫైట్; కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు;
డబుల్ బెడ్రూం ఇళ్లపై బీఆర్‌ఎస్,బీజేపీ మధ్య ఫైట్ నడుస్తోంది. ఇళ్లను పరిశీలించేందుకు బాటసింగారం వెళ్తుండగా కిషన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు పరిధి దాటగానే అడ్డుకున్నారు పోలీసులు. కిషన్ రెడ్డిని అడ్డుకోవడంపై అటు బీజేపీ కార్యకర్తల ఆగ్రహం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు కిషన్ రెడ్డ,రఘునందన్, రామచంద్రారెడ్డి. పోలీసుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎక్కడికైనా వెళ్లే హక్కుఉందని, తనను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కాన్వాయ్‌నే అడ్డుకుంటారా అంటూ తీవ్ర స్వరంతో అన్నారు. తాను ఏమైనా ఉగ్రవాదినా అంటూ పోలీసులను ప్రశ్నించారు. కేసీఆర్ జైళ్లు సిద్ధం చేసుకోవాలని,తామంతా జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు కిషన్ రెడ్డి. ఇది కల్వకుంట్ల రాజ్యమా.. పోలీసుల రాజ్యమా అంటూ నినాదాలు చేశారు.
అయితే కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో ఆయన ప్రతిఘటించారు.కిషన్ రెడ్డిని కారులోనే నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు పోలీసులు.బీజేపీ నేతలను తలోవైపునకు తరలించిన పోలీసులు.. కిషన్‌రెడ్డిని పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా రూటు మార్చి.. మార్చి సిటీలోకి తరలించారు.కేంద్ర మంత్రి వాహనాన్ని స్వయంగా శంషాబాద్ డీసీపీ డ్రైవ్ చేశారు. అటు బీజేపీ నేతలు ఈటల, డీకే అరుణలను హౌస్ అరెస్ట్ చేశారు.