నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మందుబాబు రెచ్చిపోయాడు. తాగిన మైకంలో ఏకంగా సీఐ వాహనం ఎత్తుకెళ్లాడు. మద్యం సేవిస్తున్న వారిని విచారిస్తుండగా.. పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనంతో ఉడాయించాడో యువకుడు. కోదాడ వైపు వెళ్లినట్లు గమనించిన పోలీసులు.. చేజింగ్ చేసి ఆలుగడప టోల్‌గేటు వద్ద నిందితుడ్ని పట్టుకున్నారు. చేజింగ్ సమయంలో పోలీసు వాహనం ప్రమాదానికి గురైంది. ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో ముందుభాగం ధ్వంసమైంది.