మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కొడంగల్ పర్యటనలో ఉద్రిక్రత నెలకొంది. మన్నె గూడ వద్ద పోలీసులు ఎంపీ అరుణను అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు డీకే అరుణ. తనను అడ్డుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. డీకే అరుణకు మద్దతుగా బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది.