సియోల్ లో పర్యటనలో ఉన్న తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలనున్నాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన నేతలపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి అక్రమాలకు సంబంధించిన వివాదాల్లో వారిపై ఆధారాలతో ఫైళ్లు సిద్ధమయ్యాయన్నారు. సియోల్ నుంచి హైదరాబాద్ కు చేరేసరికల్లా ఆ నాయకులపై చర్యలు ప్రారంభమవుతాయని చెప్పారు మంత్రి పొంగులేటి. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఏడాదిగా సర్కారు బానే కసరత్తు చేసినట్టుంది అనీ.. ఏం జరగబోతోందో అన్న డిస్కషన్ మొదలైంది.