Munugode: మునుగోడులో ప్రచారం ముమ్మరం.. నేతల సుడిగాలి పర్యటనలు
Munugode: మునుగోడులో అన్నిరాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నేతలు గ్రామ గ్రామాన సుడిగాలిపర్యటనలు చేస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది.;
Munugode: మునుగోడులో అన్నిరాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నేతలు గ్రామ గ్రామాన సుడిగాలిపర్యటనలు చేస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది. ఇక ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీనేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తున్నారు.
ఇక మంత్రులు తమ స్పీడ్ పెంచారు. గ్రామాల్లో యువతను పార్టీలో చేర్చుకుంటూ ముందుకుసాగుతున్నారు. మర్రిగూడలో మంత్రి హరీష్ రావు సమక్షంలో 200 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. ఫ్లోరైడ్ బాధలు సీఎం కేసీఆర్ తీర్చారని.. ఇందులో బీజేపీ వాళ్ల పాత్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డిలు ప్రచారం చేపట్టారు.
బీజేపీ అభ్యర్ధి రాజ్‌గోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా బీజేపీ రాష్ట్రనాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. మరో రెండు రోజుల్లో కేంద్రమంత్రులు కూడా రంగంలోకి దిగనున్నారు. ఇక రాజ్‌గోపాల్‌కు మద్దతుగా నిన్న MRPS నాయకులు చేపట్టిన బైకులతో ఆయన పాల్గొన్నారు. ఓటర్లు తమకే మద్దతుతెలుతారని ధీమావ్యక్తంచేశారు.
నాంపల్లి మండలం రేఖ్యాతండా గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాజగోపాల్ రెడ్డిన భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇక కాంగ్రెస్ పార్టీనేతలు సైతం మునుగోడులో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమెకు సపోర్ట్‌గా కాంగ్రెస్ నేతలు కూడా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
రంగంలోకి దిగిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పార్టీ నేతలతో కలిసి గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీలో సీతక్కతోపాటు ప్రశ్నించేందుకు స్రవంతిని గెలిపించాలని రేవంత్ రెడ్డి ఓటర్లను కోరారు.