Telangana News : హిల్ట్‌ పాలసీపై బిఆర్ఎస్ పోరుబాట..

Update: 2025-12-04 14:01 GMT

తెలంగాణలో హిల్ట్‌ పాలసీపై రచ్చ జరుగుతుంది. గులాబీ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఓవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నా సరే వాటిని పక్కన పెట్టేసి కేటీఆర్ ఈ హిల్టు పాలసీపై పోరాడుతున్నారు. ఇందులో భాగంగా నేడు పారిశ్రామిక వాడల్లో బిఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఒకప్పుడు పెట్టుబడుల కోసం పరిశ్రమలకు ఇచ్చిన భూములను ఇప్పుడు తక్కువ రేటుకే ఇచ్చేయడం అంటే పెద్ద కుంభకోణం అంటున్నారు కేటీఆర్. దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోందని దీన్ని కచ్చితంగా అడ్డుకుంటామని చెబుతున్నారు.

హిల్ట్‌ పాలసీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని.. దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ఇష్యూలను తెరమీదకి తెస్తోందని చెబుతున్నారు కేటీఆర్. ఈ భూములను పేదలకు ఇల్లు కట్టించటానికి ఉపయోగిస్తే తాము అసలు వ్యతిరేకించమంటున్నారు. హైదరాబాదులో పార్కులకు, స్మశానాలకు భూమి లేదని కాబట్టి వాటికోసం కేటాయిస్తే తాము వ్యతిరేకించబోమని అంటున్నారు.

అవసరమైతే హైడ్రా కూల్చివేసిన ఇండ్ల బాధితులకు ఈ భూములు పంచినా తాము వ్యతిరేకించబోమని చెబుతున్నారు. అంతేగాని పెద్దపెద్ద బడా బాబులకు చాలా తక్కువ ధరకు కోట్ల భూములను కట్టబెట్టడం సరికాదన్నారు. చూస్తుంటే దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి గట్టిగా పోరాడాలని కేటీఆర్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఓవైపు గ్లోబల్ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ పెద్ద కార్యక్రమం తీసుకొస్తుంది. దీనిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఈ హిల్ట్‌ పాలసీ వెనుక లబ్ధిదారులుగా మంత్రుల వారసులు ఉన్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూద్దాం.

Tags:    

Similar News